Our social:

Latest Post

Monday, 15 July 2019

Natural home remedies for oily skin | జిడ్డుగా ఉండే చర్మానికి ఇంట్లో ఉండే ఔషదాలు

జిడ్డుగా ఉండే చర్మానికి ఇంట్లో ఉండే ఔషదాలుTuesday, 9 July 2019

Benefits of Morning Walking | ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు

Benefits of Morning Walking | ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు
Saturday, 6 July 2019

Amazing Home Remedies | వంటింటి చిట్కాలు

వంటింటి చిట్కాలు : 
 • ఐదు లేదా పది మిరియాలను మెత్తగా పొడి చేసి చక్కెర లేదా నేతితో కలిపి తీసుకుంటే మామూలు జలుబు, ముక్కు కారడం, గొంతులో దురద, నోరు అతుక్కుపోయినట్టు అవ్వడం, గొంతునొప్పి, దగ్గు, జ్వరం ల నుండి ఉపశమనం లభిస్తుంది.
 • లీటరు నీటిని మరిగించి అందులో రెండు టేబుల్‌ స్పున్ల చెక్కెర, చిటికెడు ఉప్పు కలిపి కరిగిన తర్వాత చల్లార్చి వడపోయాలి. ఈ ద్రావణాన్ని తరచుగా తీసుకుంటే సమస్య అదుపులోనికి వస్తుంది. శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పుంజుకుంటుంది.
 • ఒక టీ స్పూను తేనెలో అంతే మోతాదులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని పరగడుపునే తినాలి. ఎప్పటికప్పుడు అల్లం తరిగి కలుపుకోవచ్చు, లేదా ఒకేసారి తేనె సీసాలో అల్లం ముక్కలువేసి రోజు తినవచ్చు.
 • కడుపు ఉబ్బరం కారణంగా కడుపునొప్పి ఉన్నప్పుడు కొంచెం వాముని వేడి చేసి ఒక కప్పు నీటిని జోడించి నీరు సగం అయ్యే వరకు మరిగించాలి. దీంట్లో ఒక చిటికెడు ఉప్పు లేదా పంచదారని కలిపి తాగాలి. కాస్త వాముని ఉప్పుతో కలిపి నమిలినా అజీర్తి ఉపశమనంగా పనిచేస్తుంది.
 • కండరాల నొప్పులు, కీళ్ళనొప్పులు ఉన్న ప్రాంతంలో ఒక టేబుల్ స్పూను మిరియాల పొడిని ఆవ నూనె వేసి వేడిచేసి గోరువెచ్చగా చేసి రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
 • కడుపు నొప్పిగా ఉండి, నొప్పి ఎందుకు వస్తుందో అర్ధం కానపుడు కొంచెం జీలకర్రని తీసుకుని వేడి చేయండి. ఇఫ్ఫుడు వాటికి ఒక కప్పు నీటిని చేర్చి నీరు సగం అయ్యే వరకు మరిగించండి. ఈ నీటిలో రెండు మూడు చుక్కలు నెయ్యిని వేసి తాగండి. అది గ్యాస్ వల్ల వచ్చిన కడుపు నొప్పి అయితే తగ్గుతుంది. నొప్పి ఇంకా ఉంటే మాత్రం డాక్టరుని సంప్రదించాలి.
 • టేబుల్‌ స్పూను తేనెలో అర టేబుల్‌ స్పూను అల్లం రసం కలిపి తీసుకుంటే జలుబు వదులుతుంది. ఇలా రోజుకు మూడుసార్లు చేయాలి.
 • చిటికెడు మిరియాల పొడిని మజ్జిగలో వేసుకొని ప్రతి రోజు తాగుతుంటే అరుగుదల క్రమబద్దం అవుతుంది.
 • గ్లాసు మజ్జిగలో ఒక టేబుల్‌ స్పూను కొత్తిమీరరసాన్ని కలిపి తాగినా కూడా అజీర్తి తగ్గి జీర్ణక్రియ మెరుగవుతుంది.
 • గ్లాసు నీటిలో ఒక టీ స్పూను ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ కలిపి భోజనం చేసిన తర్వాత తాగితే ఆరోగ్యానికి మంచిది. డయేరియాను నివారిస్తుంది.
 • కప్పు వేడి నీటిలో చిటికెడు పసుపు వేసి రాత్రి పడుకునేముందు తాగితే గొంతు నొప్పి, జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది.

Top Home Remedies | మీకోసం.. వంటింటి చిట్కాలు

మీకోసం.. వంటింటి చిట్కాలు  

 • 10-15 తులసి ఆకులు తీసుకొని దానికి నాలుగు వెల్లుల్లి పాయలు, ఒక టీస్పూను శొంఠి పొడిని జతచేసి మెత్తగా నూరి ఆ మెత్తటి మిశ్రమాన్ని నుదుటికి రాసుకోవాలి.
 • అర టీ స్పూను ఆవపొడిలో ఒక టీ స్పూను తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
 • అర టీస్పూను నిమ్మరసం, అర టీ స్పూను అల్లం రసం, పావు టీ స్పూను మిరియాల పొడి కలిపి రోజుకు రెండుసార్లు తాగాలి.
 • అరటిపండును చిన్నముక్కలు చేసి చిలికిన పెరుగులో కలిపి రోజుకు రెండు, మూడు సార్లు తింటే డయేరియా అదుపులోనికి వస్తుంది.
 • అనీమియాతో బాధపడుతుంటే ఆహారంలో వీలయినంత ఎక్కువగా మెంతి ఆకు తీసుకోవాలి.
 • అజీర్తితో బాధపడుతున్నప్పుడు జీలకర్రను పొడి చేసి చిటికెడు తీసుకుంటే ఉపశమనంగా ఉంటుంది.
 • ఆర్ధరైటిస్, గుండె, మెదడు, కిడ్నీలు, కళ్ల సమస్యలను దూరం చేస్తుంది. సోయాబీన్ కొవ్వుకణాల సైజును తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా తింటే స్ధూలకాయం రాకుండా శరీరాన్ని అదుపులో ఉంచుతుంది.
 • అరలీటరు నీటిలో పదిగ్రాముల నల్లతులసి ఆకులను వేసి మరిగించి ఆ నీటిని తాగుతూ ఉండాలి.
 • సగం కప్పు నీటిని మరిగించి ఒక టీస్పూను అల్లం రసం కలిపి వేడిగా తాగాలి. రెండు గంటలకొకసారి తాగుతుంటే అతిసారం పూర్తిగా తగ్గుతుంది.
 • సగం టీ స్పూను శొంఠి పొడిలో చిటికెడు ఏలకుల పొడి కలిపి ఒక టీ స్పూను తేనెలో రంగరించి తింటే దగ్గు నుంచి ఉపసమనం లభిస్తుంది.Thursday, 4 July 2019

Pawan Kalyan Real Life Story Part One
ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకుందాం.మెగాస్టార్ చిరంజీవి నాగబాబు తమ్ముడు గా మనందరికీ తెలుసు.ఆయన చిన్ననాటి జీవితంలో ఫెయిల్యూర్స్ను ఎలా ఎదుర్కొన్నారు.జీవితం మీద విరక్తి చెంది ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించారు.సినీ పరిశ్రమలో ఎలా అడుగు పెట్టి  ఏ హీరోకు లేనంత అశేష అభిమానని ఎలా సొంతం చేసుకోగలిగాడు.రాజకీయ రంగంలోకి రావడానికి గల కారణాలు ఏంటి?ఎందుకు వచ్చారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా
 తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ పూర్తి పేరు  కొణిదల కళ్యాణ్ బాబు చిన్నప్పుడే ఆస్తమా బారిన పడ్డాడు . ఎప్పుడు అనారోగ్యంతో డల్ గా ఒంటరిగా ఉండేవాడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు పవన్ తల్లి పేరు అంజనా దేవి తండ్రి పేరు వెంకట్రావు .వెంకట్రావు గారు ఓ పోలీస్ కానిస్టేబుల్ వృత్తిరీత్యా అనేక ప్రాంతాలు తిరగాల్సి వచ్చేది దాంతో పవన్ కళ్యాణ్ కూడా రకరకాల ప్రాంతాల్లో పెరిగాడు.
వెంకట్రావు గారు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ఒక్క రూపాయి కూడా లంచం తీసుకునేవారు కాదు. చాలి చాలని జీతం దాంతో పవన్ కి వైద్యం చేయించడానికి నానా ఇబ్బందులు పడే వారు.పవన్ చిన్నవాడైన అన్ని అర్థమయ్యేవి నా వల్లే నా కుటుంబ సభ్యులకు ఎన్ని కష్టాలు నేనే లేకపోతే వీళ్లకు ఇన్ని కష్టాలు ఉండవు కదా అని లోలోపల కుమిలి కుమిలి ఏచ్చేవాడు . ఆ ఎఫెక్ట్ పవన్ చదువుపై కూడా పడింది.పవన్ నెల్లూరు లోని దర్గా మిట్ట ప్రాంతాల్లో సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదువుకున్నాడు అనారోగ్యం కారణంగా చదువుపై సరిగా కాన్సెంట్రేట్ చేయలేకపోవడంతో పదవ తరగతి లో ఫెయిల్ అయ్యాడు. అది 1984వ సంవత్సరం సరిగ్గా ఆ సమయంలో నాదెండ్ల భాస్కరరావు గారు ఎన్టీఆర్ గారి ని గద్దె దించి ముఖ్యమంత్రి అయ్యారు.. నాదెండ్ల భాస్కరరావు గారు ఇచ్చిన 5 గ్రేస్ మార్కుల తో పవన్ ఒడ్డున పడిపోయాడు. నెల్లూరులోని వి ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ లో చేరాడు. పవన్ కి కాలేజీ పుస్తకాల కంటే కూడా ఆధ్యాత్మిక పుస్తకాలు ఆటోబయోగ్రఫీ లు ఎక్కువగా చదివేవారు. .పరమహంస యోగానంద యోగి ఆత్మకథ గాంధీజీ సత్యశోధన శేషేంద్రశర్మ ఆధునిక మహాభారతం పవన్ కు మెచ్చిన పుస్తకాలు . ఇక చేగోవిర  రామకృష్ణ పరమహంస వివేకానందుడు రమణ మహర్షి ఓషో యూju కృష్ణమూర్తి బడే బాబా పవన్ ను  ప్రభావితం చేసిన వ్యక్తులు.ముఖ్యంగా చేగోవిరా పోరాట జీవితం పవన్ ని ఎంత గానో ప్రభావితం చేసింది. రీసెంట్గా చేగోవిరా గురించి పవన్ ఏం చెప్పారో మీరే వినండి. "ప్రపంచంలో అరాచకం దోపిడీ నిరంకుశత్వం ఉన్న వ్యవస్థ వల్ల ప్రజలు తీవ్ర బాధలు పడుతున్నప్పుడు. నువ్వు ఆ దేశపు మనిషివి కానప్పటికీ.. నీకు వ్యక్తిగతంగా ఏమీ జరగనప్పటికీ నువ్వు పెరిగిన దేశపు సమాజపు హద్దులను చెరిపేసి ప్రపంచ పిడిత ప్రజలకు అండగా నిలబడాలి అని చెప్పినవాడు అంతేకాకుండా జీవితపు అంతిమ క్షణాల వరకూ తాను నమ్మిన సిద్ధాంతాన్ని నడిచి చూపించిన విశ్వనరుడు చేగువేరా..అందుకేనేమో దశాబ్దాల క్రితం ఎక్కడో దక్షిణ అమెరికా లోని అర్జెంటీనా లో పుట్టి పెరిగి.క్యూబా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో పోరాటాలు చేసిన చేగువేరా చిత్రం ఉత్తరాంధ్రలోని ఓ మూలకి విసిరేసినట్టుండే ఇచ్చాపురంలో స్వేచ్ఛా మాత గుడి కి వెళ్లే వీధికి ఎదురుగా ఒక మాదిగ మహనీయుడు చెప్పుల దుకాణం పైన నాకు దర్శనమిచ్చింది. ఈ ట్వీట్ చూసి మనం అర్థం చేసుకోవచ్చు . చేగువేరా ప్రభావం పవన్ కళ్యాణ్ పై ఎంతగా ఉందో రమణ మహర్షి పుస్తకాలు కూడా పవన్ పై చాలా ప్రభావాన్ని చూపించాయి నిన్ను నువ్వు తెలుసుకో అంటాడు రమణ మహర్షి. పవన్ కళ్యాణ్ దేవుడిని నమ్ముతాడు కానీ పూజలు చేయడు. జీవితంలో కష్టపడి పని చేయడం కంటే పెద్ద దైవారాధన లేదని బలంగా నమ్ముతాడు. పవన్ ఇంటర చదువుతున్నప్పటికె చిరంజీవి గారు మంచి పేరు తెచ్చుకొని మెగాస్టార్ గా స్థానం సంపాదించుకున్నాడు. దాంతో కాలేజీ లో పవన్ సెలబ్రిటీ అయిపోయాడు.. దాంతో చిరంజీవి తమ్ముడు అని స్పెషల్ గా ట్రీట్ చేసే వారు.. కానీ పవన్ కి మాత్రం సెలబ్రిటీ హోదా నచ్చేది కాదు.. సాదాసీదాగా ఉంటూ లైబ్రరీలో ఎక్కువ కాలం గడిపేవాడు.. అన్నయ్య చిరంజీవి అంటే పంచప్రాణాలు.. ఎవరైనా అన్నయ్యను విమర్శిస్తే తట్టుకునే వాడు కాదు.. కోపంతో ఊగిపోయేవాడు. అక్కడి నుండి దూరంగా వెళ్లి కాసేపు ఒంటరిగా గడిపే వాడు అన్న పై తనకున్న ప్రేమ ఇప్పటికీ రవ్వంతైనా కరగకుండా అలాగే ఉంది చూస్తూ చూస్తూనే ఇంటర్ ఫైనల్ పరీక్షలు వచ్చేసాయి పవన్ బుద్ధిగా పరీక్ష రాస్తున్నాడు .. వెనుక నుండి ఎవరో  ఒక పేపర్ స్లిప్ ని పవన్ కి ఇచ్చాడు. పవన్ కి కాపీ కొట్టే అవకాశం వచ్చింది. కానీ పవన్ 2 సెకండ్ కళ్ళు మూసుకున్నాడు.ఆ పేపర్ స్లిప్ ని దూరంగా పడేసాడు. ఎత్తిన తల దించకుండా వచ్చింది ఏదో రాసేసి బయటకు వచ్చేసాడు .పరీక్షలు అయిపోయాయి .సెలవులు వచ్చేసాయి. హాయిగా సినిమాలు చూస్తూ  ఊరూరు తిరుగుతూ ఎంజాయ్ చేయొచ్చు .కానీ అందరిలా ఆలోచిస్తే అతడు పవర్ స్టార్ ఎలా అవుతాడు. ఓ ప్రింటింగ్ ప్రెస్ లో పనివాడుగా చేరాడు.. రాత్రింబవళ్లు కష్టపడి సొంతంగా డబ్బు సంపాదించాడు. ఒక్క ఫోన్ కొడితే చాలు కోరినంత పాకెట్ మనీ పంపించే అన్నయ్య ఉన్నాడు . కానీ అలా వచ్చే డబ్బు కంటే కష్టపడి డబ్బు సంపాదించడం మంచిది అనుకున్నాడు .  సెలవులు పూర్తి అయిపోయాయి రిజల్ట్స్ వచ్చేసాయి పవన్ ఈ సారి కూడా ఫెయిల్ అయి పోయాడు . ఇంటికి వెళ్ళాడు అమ్మానాన్న తిడతారో ఏమో  అనుకున్నాడు. వాళ్లు పల్లెత్తు మాట కూడా అనలేదు.అన్నయ్య తిరుగుతాడేమో అనుకున్నాడు  పల్లెత్తు మాట కూడా అనలేదు. కనీసం వాళ్లు తిట్టినా బాగుండేది ఓ గంటసేపు ఏడ్చి మామూలు మనిషి అయ్యేవాడు. ఓ పక్కా సచిన్ టెండూల్కర్ విశ్వనాద్ ఆనంద్ అలాంటి వాళ్లు వయసుకు మించి ప్రతిభను కనబరుస్తున్నారు. నేనేమో ఇంటర్ కూడా పాస్ కాలేకపోయాను.ఎందుకు నేను బ్రతికి ఎవరిని ఉద్ధరించడానికి అని ఆత్మహత్య చేసుకోబోయాడు కాస్త లేట్ అయితే ప్రాణాలు పోయేవి అంతలో కుటుంబ సభ్యులు సమయానికి గమనించి రక్షించుకో గలిగారు. ఆరోజు ఇంట్లో రాత్రంతా pin drop silence.. అన్నయ్యలు చిరంజీవి నాగబాబు లు వదిన సురేఖమ్మ రాత్రంతా పవన్ దగ్గర కూర్చున్నారు.అప్పుడు చిరంజీవి గారు పవన్ ని దగ్గరికి తీసుకుని ఓ మాట చెప్పాడు. తమ్ముడు చదువు ఒక్కటే జీవితం కాదు. సచిన్ కి పేరు వచ్చింది అతను డిగ్రీలు చూసి కాదు.క్రికెట్ లో అతని ఆట చూసి.. Vishwanath ఆనందానికి పేరొచ్చింది చెస్ లో అతని ఆట చూసి. అలాగే నీకే rangam అంటే ఇష్టమో ముందు గుర్తించు ఆ రంగంలో రాత్రనకా పగలనకా కష్టపడు తప్పక విజయాన్ని సాధిస్తావు. మేమంతా నీ ప్రతి అడుగులో అండగా ఉంటాం అని ధైర్యం ఇచ్చాడు. తమ్ముడికి జీవితంపై మళ్లీ ఆసక్తి కలిగించడానికి. నాగబాబు సిటీ లోని బుక్ షాప్ లన్నిటినీ తిరిగి ఓ బుక్ కొనుక్కొచ్చాడ. ఆ బుక్ లో వెయ్యి మంది విజేతలు సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి.. వెయ్యి జీవితాలు.. వెయ్యి విజయాలు. పవన్ కి ఆ బుక్కు చదువుతున్నంతసేపు తెలియని కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టి నట్టుగా అనిపించింది ముఖ్యంగా లియోనార్డో డావిన్సీ బహుముఖ ప్రతిభ పవన్ నీ ఎంతగానో ఆకట్టుకుంది.. ఒక వ్యక్తికి ఇన్ని రంగాల మీద ఎలా పట్టుందని ఆశ్చర్యపోయాడు.. తాను వాళ్ళలా  జీవితంలో ఏదో ఒకటి సాధించాలని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు.అయితే కోరిక ఒక్కటే ఉంటే సరిపోదు ఆ కోరికను నెరవేర్చు కోవటానికి పట్టుదల కూడా ఉండాలి.కానీ పవన్ కి ఏ పనిలోను సాటిస్ఫాక్షన్ లభించడంలేదు కొద్దిరోజులు దేశమంతా తిరిగి పారాగ్లైడింగ్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత దానిని మధ్యలోనే వదిలేసి కర్ణాటక సంగీతం క్లాసెస్ జాయిన్ అయ్యాడు.అది కాదని violin ప్రాక్టీస్ చేశాడు.ఇవేవీ కాదని ఎలక్ట్రానిక్స్ కోర్సులో జాయిన్ అయ్యాడు. కొన్ని రోజులు డ్రాయింగ్ ప్రాక్టీస్ చేశాడు.మరికొన్ని రోజులు ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకునే ప్రయత్నం చేశాడు.ఇవేవీ కాదని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ క్లాసెస్ కు జాయిన్ అయ్యాడు అలా మూడేళ్లు లో 30కిపైగా రంగాలను ట్రై చేసాడు.. ఎందులోనూ సంతృప్తి చెందలేదు.దాంతో లైఫ్లో ఇంకా సెటిల్ కాలేక పోతున్నానే అని కొద్దిగా టెన్షన్ మొదలైంది.విపరీతంగా మానసిక ఒత్తిడికి గురయ్యాడు.ఆ ఒత్తిడి నుండి బయటకు రావడానికి వీడియో రికార్డర్ లో సినిమాలు చూడడం మొదలుపెట్టాడు.క్యాసెట్లు అయితే ఐపోతున్నాయి కానీ పవనకి తన లైఫ్ మీద క్లారిటీ రావట్లేదు. తమ్ముడు పరిస్థితి చూసి చిరంజీవి చాలా బాధ పడేవాడు. ఓ సారి పవన్ కళ్యాణ్ అన్న వదినల దగ్గరికి వచ్చాడు. అన్నయ్య నేను  ఎటూ వెళ్లాలో తేల్చుకోలేక పోతున్నాను.మీరే ఏదైనా సలహా ఇవ్వండి అని అడిగాడు.అప్పుడు అన్నయ్య చిరంజీవి వదిన సురేఖ గారు ఒకే ఒక మాట చెప్పారు నువ్వు సినిమా లో యాక్ట్ చెయ్ గొప్ప స్టార్ అవుతావ్ అన్నారు.కానీ పవన్ కి చిన్నప్పటి నుంచి బిడియం ఎక్కువ.అన్నయ్య నేను పదిమంది ముందు యాక్ట్ చేయలేను.డాన్సులు వేయలేను కావాలంటే డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో ట్రై  చేస్తానని అన్నాడు.వేరొకడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడానికి చిరంజీవి గారు ఒప్పుకోలేదు. నువ్వు యాక్టర్ వే కావాలని పట్టు పట్టాడు.అన్నయ్య సలహాలు గౌరవించి పవన్ నటించడానికి ఒప్పుకున్నాడు. వెంటనే చిరంజీవి గారు వైజాగ్ లోని సత్యానంద్ కి ఫోన్ చేసి మీరు నా తమ్ముడుకి యాక్టింగ్ లో  శిక్షణ ఇవ్వాలని కోరారు.అప్పటికి తెలీదు చిరంజీవి గారికి నాగబాబు కాకుండా మరో తమ్ముడు కూడా ఉన్నారని.సరే పంపించండి అన్నయ్య అన్నారు.పవన్ కళ్యాణ్ సత్యానంద్ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాడు.అలా పవన్ తన ఆధ్యాత్మిక లోకం నుండి రంగురంగుల సినీ లోకం లోకి భయం భయంగా అడుగులు వేస్తూ ప్రవేశించాడు.ఇక ఆ తర్వాత పవన్ అదే సినీరంగానికి తన ఫ్యాన్ ఫాలోయింగ్ తో మకుటంలేని మహారాజుగా ఎలా ఎదిగాడు.జనాల కోసం జనసేన పార్టీని స్థాపించి వారి కష్టాలను తీర్చడానికి మహా మహా దిగ్గజాలతో si అంటే సయ్యని యుద్ధం చేస్తూ జనసేనాని గా ఎలా ఎదిగాడో.Next వీడియో లో తెలుసుకుందాం.