Our social:

Thursday, 27 June 2019

B V Rao Real Story

B V Rao Real Story 

           

బి వి రావు 1990 మే 14 న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని కైకలూరు మండలం వరహాపట్నం ప్రాంతంలో బుసనబోయిన సత్యనారాయణ  అన్నపూర్ణ దంపతులకు  జన్మించాడు .బి వి రావు జీవితం గురించి మరింత సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 వ తరగతి నుంచి 6 వ తరగతి వరకు వరాహపట్నంలో సర్కారు బడిలో విద్యాబుద్ధులు  నేర్చుకున్న బి వి రావు.  ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు కలిదిండి మండలం కోరుకొల్లులో అమ్మమ్మ పాండురంగమ్మ వద్ద ఉంటూ క్రాంతి హైస్కూల్లో విద్యాభ్యాసం సాగించాడు. సమస్యలతో చదువు ముందుకు సాగదు అనుకున్న తరుణంలో అమ్మమ్మ నాన్నమ్మ వెన్నుతట్టి ముందుకు నడిపించడంతో 2005లో 10వ తరగతి తో 538 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తరువాత ఏపీఆర్జేసీ ర్యాంకు సాధించిన బి వి రావు అనంతపూర్ జిల్లాలో హిందూపురం సమీపంలోని కొడిగెనహళ్లి గ్రామంలో ఉన్న గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ పూర్తి చేశాడు.

అయితే తాను నిర్దేశించుకున్న లక్ష్యం ఒకటే అయితే ఆయన చదువుకున్నది వేరు అయినా ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు... ఏదేమైనా చార్టెడ్ అకౌంట్ ఆయన లక్ష్యం వైపు అడుగులు వేసి 2012లో సిఏ పూర్తి చేశాడు. కైకలూరు పరిసర ప్రాంతంలో  సేవలు ప్రారంభించిన మొదటి యువకుడిగా పేరు గడించాడు. తను కన్న కలలు సాకారం చేసుకున్నాడు.

లక్షల జీతాన్ని కాదనుకొని

సీఏ పూర్తి చేసుకున్న బి వి రావు  దేశ విదేశాల లక్షలాది రూపాయల జీతం ఇస్తామని కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన ఆయన వాటిని తృణప్రాయంగా వదిలేశారు. జన్మనిచ్చిన ఊరిలో ఉంటూనే చిరు వ్యాపారులకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారు. కైకలూరు లోని సి ఏ ప్రాక్టీసు ప్రారంభించారు. ఇక్కడి ప్రజలు చిరువ్యాపారుల తమ అవసరాల  కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా 2012 ఆగస్టు 14న కైకలూరులో చార్టర్డ్ అకౌంటెంట్ సేవలు అందిస్తున్నాడు.

అయితే విద్య పూర్తి చేసిన వారు సిఏ గా పని చేసే వారి వద్ద మూడున్నరేళ్లు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బి వి రావు ఎవరు తెలిసిన వారు లేకపోవడంతో. డివిజన్ కేంద్రంలోని ఓ సి ఏ దగ్గరకు వెళితే ఆయన అవహేళనగా మాట్లాడారని, ఇది కొన్ని సామాజిక వర్గాలు కే సాధ్యం అని నీవల్ల అవ్వదని వివక్ష చూపించినట్లు బి వీ రావు వాపోయారు. ఇలా ఎన్ని అవమానాలు ఎదురైనా.. అకుంఠిత దీక్షతో సి ఏ లు, మా గురువులు దివంగత జీవి పూర్ణచందర్రావు బాబు శ్రీకర్ ల వద్ద శిక్షణ పూర్తి చేసుకొని ప్రస్తుతం కైకలూరులో సేవలు అందిస్తున్నాడు.

రాజకీయ రంగ ప్రవేశం

బి వి రావు కి చిన్నతనం నుంచి రాజకీయాల మీద ఆసక్తి ఎక్కువ .బి వి రావు గారి అమ్మమ్మ పాండురంగమ్మ గారు కోరుకొల్లులో అప్పట్లో ఇండిపెండెంట్గాగా ఎంపీటీసీగా పోటీచేసి గెలుపొందారు. అప్పుడు అధికార పార్టీ  టిడిపిలో జాయిన్ అయ్యారు. అ తరువాత బీ రావు గారి తండ్రి బుసనబోయిన సత్యనారాయణ గారు 2001లో వరాహపట్నం గ్రామానికి టిడిపి తరఫున ఎంపీటీసీ గా పోటీ చేసి అఖండ భారీ మెజార్టీతో గెలుపొందారు. అదే టైములో బి వి రావు గారు మేనత్త కరేటి వెంకటేశ్వరమ్మ టిడిపి తరఫున ఆచారం గ్రామంలో ఎంపీటీసీ గెలుపొందారు . బి వి రావు కి అప్పటినుంచే రాజకీయాల మీద మక్కువ ఎక్కువ. సి ఏ గా కైకలూరు పరిసర ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్న బి వీ రావు. ప్రముఖ సినీ నటుడు జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్  గారి ఆసియా సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఇటీవలే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సేవలందిస్తున్న బి వి  రావు కి జనసేనుడి పిలుపునందుకుని ఆ పార్టీలో చేరారు. ఫిబ్రవరి 8 2019  పార్లమెంట్ నియోజకవర్గ ఆర్గనైజింగ్ కార్యదర్శి గా బి వి రావు నియమితులయ్యారు. ఆ తరువాత  కైకలూరు నియోజకవర్గ జనసేన అసెంబ్లీ అభ్యర్థి గా సీటు దక్కించుకున్నారు. అప్పటికే అటు టీడీపీ లో ఇటు వైసీపీలో బడా నేతలు ఉన్న తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు వాళ్లకు దీటుగా అతి కొద్ది టైం లోనే ప్రచారాన్ని సాగించి ఏ ఒక్కరికి మద్యం గాని డబ్బు గాని ఇవ్వకుండా 11000 ఓటుబ్యాంకును సాధించుకున్నాడు. తాను ఓడిపోయినా కైకలూరు నియోజకవర్గం లో ఒక పెను మార్పు సృష్టించాడు. ఓటు కి నోటు అన్న సిద్ధాంతాన్ని తిరగరాశాడు. తాను ఓడిపోయిన జనసేన పార్టీ తరపున సేవలు,అందిస్తూనే ఉంటానని ఆయన చెప్పారు.

కుటుంబం

విజయవాడకు చెందిన Dr.పి అనూష ను కులాలకు మతాలకు అతీతంగా ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు. బి వి రావు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను  అధిరోహించాలని మనము కోరుకుందాం...

0 comments:

Post a comment