Our social:

Wednesday, 3 July 2019

YS Jagan Mohan Reddy Real Story

మోహన్ రెడ్డి వైయస్

  2009 సెప్టెంబర్ 2nd ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర లోని ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆ ఒక్క సంఘటన ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తలరాతనే మార్చేసింది. ఎవరు అవునన్నా కాదన్న ఇది నిజం. ఆ విషాద సంఘటన వైఎస్సార్ మరణం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ నల్లమల్ల అడవుల్లో కోల్పోయింది దాంతో వైయస్సార్ గారు మరణించారు. వైయస్సార్ ఉన్నన్ని రోజులు కాంగ్రెస్లోనూ ఆడు ప్రతిపక్ష పార్టీలోనూ ఆయనను ఎదురు తిరిగే వాళ్ళు లేరు. అట్టడుగున పడి పోయిన కాంగ్రెసు ను తన పాదయాత్రతో ఒక స్థానాన్ని సృష్టించారు.వైయస్సార్ మరణం తర్వాత ఒకపక్క యావత్ తెలుగు ప్రజలు శోక సముద్రంలో మునిగి పోతే కొంతమంది నాయకులు సీఎం కుర్చీ కోసం పన్నాగాలు పన్నుతున్నారు.ఈ విషయాన్ని గమనించిన వైయస్సార్ కేడర్ అప్పటికప్పుడు 150 ఎమ్మెల్యేలతో సంతకాలు సేకరించి వైయస్సార్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి ని సీఎం నీ చెయ్యాలని డిమాండ్ చేశారు.  అప్పటి వరకు తల్లి చాటు బిడ్డగా ఉన్న జగన్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తాను తలుచుకుంటే అప్పటికప్పుడు 150 ఎమ్మెల్యేల మద్దతుతో పార్టీకి ఎదురు తిరిగి ముఖ్యమంత్రి పదవి దక్కించుకునే వాడు.కానీ జగన్ అలా చేయలేదు.అధిష్టానం ఎలా చెబితే అలా నడుచుకుంటారని నా తండ్రి అలాగే నడుచుకున్నారని . నా తండ్రి నాకు అదే నేర్పారని కామ్ గా ఉండిపోయాడు.మరోవైపు తమ అభిమాన నేత హటాత్ మరణాని తట్టుకోలేక చాలా మంది అభిమానులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ వార్త అప్పట్లో నేషనల్ మీడియాలో కూడా పెను సంచలనం సృష్టించింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను ఓదారుస్తానని పావురాలగుట్టలో జగన్ మాట ఇచ్చారు.ఇక్కడే  ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులకు జగన్ను టార్గెట్ చేయడానికి ఆయుధం  దొరికింది. జగన్ ప్రకటించిన ఓదార్పుయాత్రను బూచిగా చూపించి.సోనియా మనసులు లో జగన్ పట్ల ద్వేషం పుట్టేలా చేశారు. జగన్ మాత్రం  తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఓదార్పు యాత్రను చేపట్టారు. ప్రజలు తన పట్ల చూపిస్తున్న ఆత్మీయ అనురాగాలకు జగన్ చలించిపోయాడు.అధిష్టానం పేరు చెబుతే గజగజ వణికిపోయే నాయకులు ఉన్న ఆ కాలంలో  పట్టుమని కేవలం వంద రోజులు ఎంపీగా అనుభవం ఉన్న కుర్రాడికి అధిష్టానాన్ని సైతం ఐడోంట్ కేర్ అంటూ ఎదిరించే తెగింపు ఇచ్చింది. ఇన్ని రకాల ఒత్తిళ్లు వచ్చినా ఓదార్పు యాత్ర కొనసాగించాడు. రాజకీయంగా వ్యాపార పరంగా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని చూసిన . జగన్ మాత్రం భయపడలేదు రోజురోజుకు జనాల్లో జగన్ కు ప్రజాదరణ పెరగసాగింది . జనాలు జగన్ను ను అక్కున చేర్చుకున్నారు.  జగన్ కు పెరుగుతున్న ప్రజాదరణ ఓర్వలేక ఢిల్లీ పెద్దలు పరిస్థితి చేయి దాటిపోతుందని సోనియా కు చెప్పారు.సోనియాగాంధీ విజయమ్మ జగన్ షర్మిల ను ఢిల్లీకి పిలిపించుకుని. వెంటనే ఓదార్పు యాత్ర ను ఆపేయాలని ఆర్డర్ వేసింది.అంతగా కావాలనుకుంటే ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను ఓ చోటికి పిలిపించుకొని నేర్చుకోమని ఓ సలహా కూడా ఇచ్చింది. అంతేకాదు యాత్రను మానేస్తే సెంట్రల్ మినిస్టర్ పదవి ఇస్తానని ప్రలోభపెట్టే ప్రయత్నం  చేశారు.అధిష్టానం మాట వినకుండా జగన్ ఓదార్పు యాత్రను కొనసాగించాడు.కాంగ్రెస్ అధిష్టానం జగన్ టార్గెట్ చేస్తూ పావులు కదపడం మొదలు పెట్టింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైయస్ వివేకనంద కి క్యాబినెట్ మినిస్టర్ ఇస్తామని ఆశ చూపించి వైయస్ కుటుంబం  రెండుగా చీల్చే ప్రయత్నం చేశారు. కుటుంబం జోలికి వచ్చేసరికి జగన్ తట్టుకోలేక పోయాడు. ఇంక చాలు ఇక ఈ పార్టీలో. నాకు భవిష్యత్తు లేదని తేలిపోయిందని ఓ క్లారిటీకి వచ్చాడు.2010 నవంబర్ 29 వైఎస్ జగన్ కడప ఎంపీ స్థానానికి రాజీనామా చేశాడు. విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి. అలాగే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు . 2010 డిసెంబర్ ఏడు త్వరలో ఓ కొత్త పార్టీని స్థాపిస్తారని తొలిసారిగా పులివెందులలో ఎనౌన్స్ చేసాడు.2009లో తెలంగాణకు చెందిన ఓ అడ్వకేట్ వైయస్సార్ వీరాభిమాని శివకుమార్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని జగన్ టేకోవర్ చేస్తున్నాడు. ఆ తర్వాత మరికొంతమంది పదవుల్లో ఉన్న వైయస్సార్ అనుచరులు తమ పదవులకు రాజీనామా చేసి. ఉప ఎన్నికల బరిలో నిలిచారు.19 ఎమ్మెల్యే  స్థానాలకు ఒక ఎంపీ స్థానానికి జరిగిన బై ఎలక్షన్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 16 ఎమ్మెల్యే స్థానాలను ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకుని ఢిల్లీ సింహాసనాన్ని షేక్ చేసింది. వైఎస్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదు లక్షలకు పైగా మెజారిటీతో .ఎంపీ స్థానాన్ని గెలుచుకున్నాడు.  ఆ దెబ్బకు అప్పటివరకు  కుర్రకుంక అని లైట్ తీసుకున్న టెన్ జనపథ్ జగన్ ని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. అందులో భాగంగా జగన్ పై ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ల్  యాక్ట్ కింద 31 క్రిమినల్ కేసులను ప్రివెన్షన్ ఆఫ్ కలెక్షన్ యాక్ట్ కింద. 11 కేసు నమోదు చేశారు. జగన్ పని పట్టడానికి సి.బి.ఐ ఈడీలను ఉసిగొల్పింది హైదరాబాద్ లో దిల్కుషా గెస్ట్ హౌస్ లో మూడు రోజుల పాటు ఇంటరాగేషన్ జరిగింది.

2012 మే నెలలో సిబిఐ జగన్ ని అరెస్ట్ చేసింది 16 నెలల పాటు జగన్ జైలు జీవితం గడిపారు. జగన్ జైలుకెళ్లి మరుక్షణం వైఎస్ఆర్సిపి కుక్కలు చింపిన విస్తరాకు అయిపోతుందని ఢిల్లీ పెద్దలు అనుకున్నారు. ఎమ్మెల్యే ఎంపీ లు వస్తారని  ఆశించారు కానీ అలా జరగలేదు . కొడుకు జైలుకి వెళ్ళాడు అన్న బాధను దిగమింగుకుని విజయమ్మ పార్టీ అధ్యక్షురాలిగా ముందుండి నడిపించింది. చెల్లెలు షర్మిల పాదయాత్ర చేపట్టి అన్న పడుతున్న కష్టాలను జనాలకు వినిపించింది జైల్లో ఉన్న జగన్ కి రోజురోజుకి ప్రజల్లో సింపతీ పెరుగుతుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో 2014 ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేయించారు.2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 175 స్థానాలకు గాను 67 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకొని నవ్యాంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ హోదాను దక్కించుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షపార్టీ నేతగా ఎన్నుకోబడ్డారు. 2014 ఎన్నికల్లో జగన్ ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయిన టిడిపి బిజెపి జనసేన పార్టీలను ఎదుర్కుని శభాష్ అనిపించుకున్నాడు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య పైన అలుపెరుగని పోరాటం చేశారు. రైతులు నిరుద్యోగ సమస్య కాల్ మనీ రాకెట్. అగ్రిగోల్డ్ బాధితుల .సమస్యలు తో ఏపీ స్పెషల్ స్టేటస్ . డోక్రా మహిళల రుణమాఫీ కాకపోవడం. కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యలు. ప్రభుత్వ అవినీతి. రాజధాని  ఏర్పాటులో జరిగిన అక్రమ వ్యవహారాలు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయడం. ఎమ్మార్వో వనజాక్షి పై దౌర్జన్యం. ఓటుకు నోటు వ్యవహారం. ఇలా ఎన్నో సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు,. అసెంబ్లీ స్పీకర్ ఏకపక్షంగా వివరించిన తనకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా కట్ చేసిన .ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో ఆయన వెనక్కి తగ్గలేదు.

     వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్ 6న ప్రజా సంకల్ప యాత్ర ను ప్రారంభించాడు . రాష్ట్రవ్యాప్తంగా 341 రోజులపాటు 231 మండలాల్లో 2516 గ్రామాల మీదుగా 3600 48 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టి .అధికార ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టాడు అన్ని వర్గాలను కష్టాల కడలి నుంచి బయటపడేసేందుకు నవరత్నాలకు మెరుగులు దిగడంతోపాటు విమర్శలు మన్ననలు సైతం పొందేలా సరికొత్త హామీలు ఇస్తూ . 2019 జనవరి 9న ఇచ్చాపురం వద్ద పాదయాత్రను ముగించారు.  మళ్లీ రాజన్న మా కష్టాలు తీర్చడానికి వచ్చాడా అని . జగన్ గెలిస్తే మళ్లీ రాజన్న పాలన వస్తుందని బలంగా నమ్మారు. రావాలి జగన్ కావాలి జగన్ అంటూ ఆంధ్రప్రదేశ్ జగన్ రాగాన్ని అందుకుంది. ఒకసారి స్పెషల్ స్టేటస్ వద్దు స్పెషల్ ప్యాకేజీ ముద్దు అనడం. ఆ తర్వాత స్పెషల్ స్టేటస్ కావాలని డిమాండ్ చేయడం. ఇలా పూటకో మాట మారుస్తూ. ఏ పార్టీని భూస్థాపితం చేయడానికి అయితే అన్న NTR గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు అదే పార్టీ వడిలో టిడిపి కూర్చోబెట్టడం తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోయారు.

2019 లో జరిగిన ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి 91 వేల భారీ మెజార్టీతో పులివెందుల నియోజకవర్గం నుండి గెలుపొందారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను దాదాపు 150 స్థానాలు గెలుచుకొని భారీ ఆధిక్యంతో ఎన్నికల్లో గెలిచారు. అంతే కాదు రెండు మూడు తప్పించే ఆల్మోస్ట్ అన్ని ఎంపీ స్థానాలను గెలుచుకొని  ఢిల్లీలోని తన సత్తా చాటుకున్నాడు.గెలిచిన మరుక్షణం ప్రజల ముందుకు వచ్చి ఊదరగొట్టే ఉపన్యాసాల్లో పాదయాత్రలో మీ ఇంటింటికి నేను వచ్చాను .మీ బాధలన్నీ నేను విన్నాను .మీ అందరికీ నేనున్నాను. అని భరోసా యిచ్చాడు. గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటో చూపిస్తాను అన్నాడు. ప్రమాణ స్వీకారం  చేయగానే యొక్క సంతకం  డ్రీమ్ ప్రాజెక్ట్ నవరత్నాలు అన్నింటినీ అమలుపరచి వచ్చే ఆరు నెలల్లో సంవత్సరం లోపలే .జగన్ ముఖ్యమంత్రి అని మీ అందరితో అనిపించుకున్నాని అన్నారు.2019 మే 30 వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. స్వీకారం చేసిన వెంటనే తాతయ్యలకు అవ్వలకు పెన్షన్ 3000 గా పెంచుతూ మొదటి సంతకం చేశాడు.అయితే  మూడువేల రూపాయలు డివిజన్ల వారీగా పెరుగుతాయి అని హామీ ఇచ్చాడు.ఆగస్ట్ 15 కల్లా పూర్తిస్థాయి గ్రామ వాలంటీర్లు నియమిస్తామని జగన్ హామీ ఇచ్చారు.తాను ఇతర అన్ని హామీలు నెరవేరుస్తారని ఆయన చెప్పారు. మరెన్నో పథకాల ఇచ్చి యావత్ ఆంధ్రప్రదేశ్ శభాష్ అనిపించుకోవాలని నవ యువ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుందాం.


0 comments:

Post a comment