Our social:

Thursday, 4 July 2019

Pawan Kalyan Real Life Story

1992 జనవరి లో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ కి యాక్టింగులో ట్రైనింగ్ ఇప్పించాలి అనుకున్నారు. సత్యానంద్ గారి దగ్గర యాక్టర్స్ నుండి యాక్టింగ్ రాబట్టుకునే అరుదైన క్వాలిటీ నీ చిరంజీవి గారు గమనించారు. చిరంజీవి గారు స్వయంగా సత్యానంద్ కి ఫోన్ చేసి  చెన్నై కి వచ్చి కలవమన్నారు. వెంటనే సత్యానంద్ గారు చెన్నైకి వచ్చేసారు..పవన్ కళ్యాణ్ కి శిక్షణ ఇచ్చే బాధ్యతను సత్యానంద్ గారికి అప్పజెప్పారు.చిరంజీవి గారు పవన్ ని ఇంట్రడ్యూస్ చేశారు.మా వాడికి బిడియం ఎక్కువ నలుగురిలో మాట్లాడలేడు.ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాదు పవన్ బిహేవియర్ ఎలా ఉంటుందో చిరంజీవి గారు చెప్పారు. నిజానికి ఒక నటుడికి ఏమేం క్వాలిటీస్ ఉండకూడదో అవన్నీ  పవన్ కళ్యాణ్ లో ఉండేవి.సత్యానంద్ దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నాడు.

చెన్నైలో నెల రోజుల పాటు పవన్ కళ్యాణ్ కి పర్సనల్ ట్రైనింగ్ ఇచ్చాడు.  పవన్ కి యాక్టింగ్ నేర్పాలంటే ముందు బిడియం పోగొట్టాలి అని సత్యానంద్ కే అర్థమైంది.సత్యానంద్ గారు పవన్ ని స్టేజి పైకి వెళ్ళమన్నారు. పవన్ అలాగే వెళ్ళాడు బిడియంతో  గట్టిగా అరవమన్నాడు.పవన్ అలాగే చేశాడు.ఇది సరిపోదు ఇంకా పెద్దగా అరవాలి అన్నాడు.పవన్ అలాగే అరిచాడు.ఈసారి అరిచిన అరుపుకి వర్కర్స్ అందరు ఏమైందో అని వచ్చారు.ఇప్పుడు వాళ్ళందరిముందు అరవ మన్నాడు.పవన్ అందరూ ఉన్నారని సంకోచిస్తున్నడు.ఎవరిని పట్టించుకోకు ఇక్కడ నువ్వొక్కడివే ఉన్నావనుకో గట్టిగా అరువు అన్నాడు.పవన్ ఒక్కసారిగా గట్టిగా అరి చేశాడు.అప్పుడు సత్యానంద్ గారు క్లాప్స్ కొట్టి వెల్ డన్ అన్నారు. అది పవన్ కళ్యాణ్ కి వచ్చిన ఫస్ట్ appreciation. వన్ మంత్ తర్వాత సత్యానంద్ గారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్లి పర్సనల్ ట్రైనింగ్ అయిపోయింది ..కానీ ఇది సరిపోదు గ్రూప్ ఇంటరాక్షన్ చాలా అవసరం.. వైజాగ్ తీసుకెళ్లి నా గ్రూప్ తో కలిపి ట్రైనింగ్ ఇస్తాను అన్నాడు అందుకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.అలా పవన్ వైజాగ్ రావడం మరో మూడు నెలలు ట్రైనింగ్ తీసుకోవడం జరిగిపోయాయి.ఓ ఇంటర్వ్యూలో సత్యానంద్ పవన్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆలోచనలు చాలా జెన్యూన్ గా ఉంటాయి.ఎక్కడా deviations ఉండవు.ముక్కు సూటిగా మాట్లాడుతారు. నేను బాగా యాక్ట్ చేసావ్ అన్నాక కూడా ఆయనకి నచ్చకపోతే. సార్ మరోసారి చేసి చూపిస్తానని తనకు తానే intiation తీసుకొని మళ్లీ యాక్ట్ చేసేవాడు. ఓ చిన్న పిల్లవాడు పలక బలపం  పట్టుకొని ఎలా అయితే నేర్చుకుంటాడో అలా పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తమ్ముడి నని రవ్వంత కూడా గర్వం లేకుండా వినయంగా ఉండి ఒక్కో పాఠాన్ని నేర్చుకున్నాడనీ చెప్పారు.
పవన్ ది లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యి   ముందుకు పోయే మనస్తత్వం కాదని.. అతడు నిరంతరం పోటీపడే ఓ ఫైటర్ అని పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఓ  ఇంటర్వ్యూలో లో సత్యానంద్ గారి ట్రైనింగ్ తనకు ఎంతో ఉపయోగపడింది అని చెప్పాడు. అక్కడే నేను సిగ్గును మొహమాటాన్ని బద్దలు కొట్టానని.. సినిమా చేసినా చేయకపోయినా నా బతుకు నేను బతకగలనని ధైర్యం కలిగింది.. అదో గొప్ప మార్పు అని పవన్ తన గురువును ఆకాశానికెత్తేశాడు... పవన్ ఆ తర్వాత కాలంలో అంటే 1993లో సత్యానంద్ చెల్లెలి పెళ్లికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసాడు. అప్పటికి ఇంకా పవన్ సినీరంగంలోకి ప్రవేశించి లేదు. అన్న ఇచ్చే పాకెట్ మనీని జల్సాలకు ఖర్చు పెట్టకుండా. రూపాయి రూపాయి దాచుకొని పోగుచేసుకున్న డబ్బులు అవి. అలాగని సత్యానంద్ గారు పవన్ ని సహాయం అడగలేదు. ఇబ్బందుల్లో ఉన్నాడని పవన్ సత్యానంద్ గారి మాటల ద్వారా గ్రహించి తానే స్వయంగా వచ్చి డబ్బు సహాయం చేసాడు. పవన్ హెల్పింగ్ నేచర్ కి ఇదో గొప్ప ఉదాహరణ.స్వయంగా సత్యానంద్ గారే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు.  ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మొదటి సినిమా అవకాశం వచ్చినా ! అనుకోని కొన్ని కారణాలవల్ల వాయిదాపడుతూ వచ్చింది. అలా పవన్ కళ్యాణ్ కి రెండేళ్లు వేస్ట్ అయిపోయాయి.ఈ రెండేళ్ల గ్యాప్ లో పవన్ కరాటి, మార్చ్ ల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు.రెండేళ్ల తరువాత చివరికి షూటింగ్ స్టార్ట్ అయింది.ఈవీవీ సత్యనారాయణ గారు సినిమాకి డైరెక్టర్ . క్యూట్ లవ్ స్టోరీ అది హీరోయిన్ గా అక్కినేని నాగేశ్వరావు గారి మనవరాలు సుప్రియ చేస్తోంది. మొదటి సినిమా కాబట్టి పవన్ చాలా ఇబ్బందికి గురి అయ్యాడు.
అప్పటివరకు అలవాటు లేని రంగురంగుల డ్రెస్సులు ఎబ్బెట్టుగా అనిపించాయి.ఆ బాధ పడలేక దేవుడా ఇదే నా చివరి సినిమా కావాలి అని కోరుకున్నాడట.సినిమా అంత పెద్దగా ఆడకపోయినప్పటికీ పవన్ కి మంచి గుర్తింపు నిచ్చింది.ముఖ్యంగా మూవీ లో పవన్ చేసిన stunts అప్పట్లో సంచలనం సృష్టించాయి.నిజానికి ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యేoతవరకు కూడా అందరూ పవన్ నీ కళ్యాణ్ అనే పిలిచేవారు. 1997లో kalyan ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కరాటే ఎక్స్పర్ట్స్ ముందు మీడియా చూస్తుండగా తన సాహస కార్యాలను లైవ్ డెమో ఇచ్చాడు .అద్భుతమైన ప్రదర్శన చూసి  సభ్యులు కళ్యాణ్ కి బలం లో హనుమంతుడు అని అర్థం వచ్చేలా పవన్ అనే బిరుదు ఇచ్చారు. ఇక అప్పటినుండి కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయిపోయాడు.సినిమాల్లో డేంజరస్ stunts నీ మార్షల్ ఆర్ట్స్ ని జోడించి పవర్ ఫుల్ యాక్షన్ పర్ఫామెన్స్ ఇస్తూ వచ్చాడు .కనుక పవర్ స్టార్ ట్యాగ్ వచ్చింది.పవన్ రెండో సినిమా గోకులంలో సీత మొహమాటం కొద్దీ ఈ సినిమా ఒప్పుకున్నాడని పవన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మెల్లిమెల్లిగా సిని వాతావరణం అలవాటైపోయింది. సుస్వాగతం సినిమా లో చదువు బాధ్యత వదిలేసి. ప్రేమే జీవితం అనే పాకులాడే యువకుడి క్యారెక్టర్లో లో నటించాడు. నటించాడు అనేకంటే ఆ క్యారెక్టర్ కి జీవం పోసాడు అని చెప్పాలి . అందులో హీరో తండ్రి క్యారెక్టర్ రఘువరన్ చనిపోయే ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్లో పవన్ నిజంగానే ఏడ్చి చేశాడు డైరెక్టు కట్ చెప్పిన సరే  పవన్ ఏడుస్తూనే ఉన్నాడు.  సుస్వాగతం లో పవన్ కళ్యాణ్ నటనకి ఫ్యామిలీ ఆడియన్స్ ముగ్ధులైపోయారు ఇక ఆ తర్వాత పడింది ఒక సినిమా ఆ సినిమా పవన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రెండ్ నే మార్చేసి పడేసింది. ఆ సినిమానే తొలిప్రేమ ఓ మధ్యతరగతి యువకుడి పాత్రలో పవన్ ఒదిగిపోయాడు థియేటర్లన్నీ జనాలతో నిండిపోయాయి.
నా హృదయాన్ని హత్తుకునే సినిమా తొలిప్రేమ అని పవన్ చాలా సందర్భాల్లో చెప్పాడు. ఈ సినిమాతో పవన్ కి యూత్ లో చాలా ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఇక కెరీర్ తొలినాళ్లలో శీతల పానీయాల  ప్రకటనలో కనిపిస్తే కోరినంత డబ్బు ఇస్తామని ఆఫర్ వచ్చింది. మరో ఆలోచన లేకుండా పవన్ అగ్రిమెంట్ సైన్ చేసాడు నిజానికి పవన్ కళ్యాణ్ గారికి కూల్డ్రింక్స్ తాగే అలవాటు లేదు . అగ్రిమెంట్ సైన్ చేసిన కాబట్టి ఆ యాడ్ ని పూర్తి చేసాడు.అదే అతని చివరి యాడ్.  1999 లో తమ్ముడు 2000  సంవత్సరంలో బద్రి  2001లో ఖుషి  వరుసగా బ్యాక్ టు బ్యాక్  త్రీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు థియేటర్లో కలెక్షన్ల వర్షం కురిపించాయి.
బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలు అయిపోయాయి.  తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ కి తనకంటూ ఓ ఐడెంటిటీ ఏర్పరుచుకోవడమే కాకుండా వలస బ్లాక్ బస్టర్ హిట్లతో మకుటం లేని మహారాజుగా నిలిచాడు. తెలుగు రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల వాళ్లు కూడా పవన్ క్రేజ్ చూసి ఆశ్చర్యపోయరు.ఇంతలో  పవర్ స్టార్ కి  పదేళ్ల వనవాసం చేయవలసి వచ్చింది. బ్యాక్ టూ బ్యాక్  ఫ్లాప్ మూవీస్ మధ్యలో జల్సా తీన్మార్ లాంటి సినిమాలు మెరుపు మెరిసిన పవన్ స్థాయికి తగ్గిన ఇట్లు కావు కానీ  ఇక్కడ ఓటమిలో కూడా పవన్ విజయాన్ని సాధించాడు 2 సినిమాలు ఫ్లాప్ అయితే చాలు మహా మహానటి అడ్రస్ లేకుండా గల్లంతు అయిపోతారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఏకంగా పదేళ్లపాటు ఒక్కసారైనా హిట్ పడకపోయినా అభిమానులు రోజురోజుకు పెరుగుతుంది తప్ప ఎక్కడా తగ్గలేదు. అందుకే పవన్ కి అభిమానులు అంటే అంత ప్రాణం.ఓసారి పవన్ కళ్యాణ్ కారు ముందికి ఓ అభిమాని వచ్చాడు.. అన్న ఒక్క హిట్ సినిమా ఇవ్వన్నా బయట ఎత్తుకోలేకపోతున్నాము అని ఆ అభిమాని ఏడ్చేశాడు... ఓ అభిమానిగా అతని ఆవేదన పవన్ ని కదిలించింది.... పైకి చూస్తూ నా కోసం కాకపోయినా నా అభిమానుల కోసం అయినా ఒక్క హిట్ ఇవ్వు అని గట్టిగా కోరుకున్నాడు.... రాత్రింబవళ్లు కష్టపడి ఫుల్ ఎనర్జీతో ఓ సినిమా తీశాడు...అదే గబ్బర్ సింగ్ అప్పటి వరకూ ఉన్న రికార్డులన్నిటినీ తిరగరాసిన సినిమా అది.... ఆ సినిమాకి పవన్ కళ్యాణ్ కి ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది... అప్పుడు తన ఫ్యాన్స్ అందరి ముందు పవన్ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో క్లాస్ ఆడియన్స్ ని కూడా కట్టిపడేసాడు..... త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది.. అల్లుడు సెంటిమెంట్ నీ బేస్ చేసుకుని తీసిన ఆ సినిమాలో అద్భుత నటనని కనబరిచాడు.... ముఖ్యంగా ఆడియన్స్ అందరూ క్లైమాక్స్ సీన్ లో కంటతడి పెట్టేలా పాత్రలో  జీవించేశాడు... 2018 లో వచ్చిన అజ్ఞాతవాసి పవన్ చివరి సినిమా.

      ఇక  నా జీవితం ప్రజాసేవకే అంకితం అని రాజకీయాల్లోకి  వచ్చేసాడు. ప్రజలకు సేవ చేయాలనే ఓ మంచి ఉద్దేశంతో ఆ డెసిషన్ తీసుకున్నాడు.. కాబట్టి పవన్ నిర్ణయాన్ని అభిమానులు కూడా స్వాగతించారు ..జనసేన జెండాలేత్తి పవన్ కళ్యాణ్ నీ సీఎం చేసే బాధ్యత ను తమ భుజాలపై వేసుకొని రాత్రింబవళ్ళు కృషి చేస్తున్నారు... నిజానికి పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీని స్థాపించాడు.ఒక్క సీటు కూడా ఆశించకుండా 2014 లో టీడీపీ బీజేపీ కూటమి తరపున ప్రచారం చేసి తెలుగు జనాల హృదయాలను గెలుచుకున్నారు ...టిడిపి అధికారంలోకి రావడంలో ప్రధాన పాత్ర పోషిం చాడు .నరేంద్ర మోడీ గారు సెంట్రల్ మినిస్టర్ పదవి ఇస్తానన్న సున్నితంగా తిరస్కరించాడు.తాను ఏ పార్టీనయితే అధికారంలోకి తీసుకువచ్చాడో.ఆ పార్టీతోనే పోరాడి. జనాల సమస్యలు తీర్చే ప్రయత్నం చేశాడు. అయితే పవన్ రాజకీయాల్లోకి రాక ముందే సామాజిక సేవా దృక్పథంతో అనేకమందికి సహాయం చేసి కోట్లాది తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు.చిన్నారి శ్రీజకు 2 లక్షలు.. ఏపీ లో తుఫాన్ బాధితులకు 50 లక్షలు.. ఉత్తరఖండ్ లో వరదలు వస్తే 20 లక్షలు.. ఇలా చెప్పుకుంటూ పోతే పేజీలు సరిపోవు..పవన్ కళ్యాణ్ క్రీడా రంగానికి కూడా చాలా సేవ చేసాడు .షూటర్ రేఖకు 500000.. బోర్డ్ ఆఫ్ డిజేబుల్ క్రికెట్ అసోసియేషన్ 500000 కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన రాహుల్ రాగాలకి 10 లక్షలు... ఇలా చాలా మంది క్రీడాకారులకు ఆర్థిక సహాయం చేసాడు . 2019 ఎన్నికల్లో నేరుగా బరిలోకి దిగాడు.జనసేన పార్టీ ఓడిపోయిన తాను పోరాడుతూనే ఉంటానని ఓ సందర్భంలో చెప్పారు.ఆయన మాటల్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం.పవన్ కళ్యాణ్ గారు మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుందాం


0 comments:

Post a comment