Top Home Remedies | మీకోసం.. వంటింటి చిట్కాలు
మీకోసం.. వంటింటి చిట్కాలు
- 10-15 తులసి ఆకులు తీసుకొని దానికి నాలుగు వెల్లుల్లి పాయలు, ఒక టీస్పూను శొంఠి పొడిని జతచేసి మెత్తగా నూరి ఆ మెత్తటి మిశ్రమాన్ని నుదుటికి రాసుకోవాలి.
- అర టీ స్పూను ఆవపొడిలో ఒక టీ స్పూను తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
- అర టీస్పూను నిమ్మరసం, అర టీ స్పూను అల్లం రసం, పావు టీ స్పూను మిరియాల పొడి కలిపి రోజుకు రెండుసార్లు తాగాలి.
- అరటిపండును చిన్నముక్కలు చేసి చిలికిన పెరుగులో కలిపి రోజుకు రెండు, మూడు సార్లు తింటే డయేరియా అదుపులోనికి వస్తుంది.
- అనీమియాతో బాధపడుతుంటే ఆహారంలో వీలయినంత ఎక్కువగా మెంతి ఆకు తీసుకోవాలి.
- అజీర్తితో బాధపడుతున్నప్పుడు జీలకర్రను పొడి చేసి చిటికెడు తీసుకుంటే ఉపశమనంగా ఉంటుంది.
- ఆర్ధరైటిస్, గుండె, మెదడు, కిడ్నీలు, కళ్ల సమస్యలను దూరం చేస్తుంది. సోయాబీన్ కొవ్వుకణాల సైజును తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా తింటే స్ధూలకాయం రాకుండా శరీరాన్ని అదుపులో ఉంచుతుంది.
- అరలీటరు నీటిలో పదిగ్రాముల నల్లతులసి ఆకులను వేసి మరిగించి ఆ నీటిని తాగుతూ ఉండాలి.
- సగం కప్పు నీటిని మరిగించి ఒక టీస్పూను అల్లం రసం కలిపి వేడిగా తాగాలి. రెండు గంటలకొకసారి తాగుతుంటే అతిసారం పూర్తిగా తగ్గుతుంది.
- సగం టీ స్పూను శొంఠి పొడిలో చిటికెడు ఏలకుల పొడి కలిపి ఒక టీ స్పూను తేనెలో రంగరించి తింటే దగ్గు నుంచి ఉపసమనం లభిస్తుంది.
0 comments:
Post a Comment